IPL 2021: Mitchell McClenaghan slams Virat Kohli for excessive appealing, gets trolled by fans
#RCB
#Ipl2021
#ViratKohli
#RishabhPant
ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషబ్ పంత్ వికెట్ కోసం ఫీల్డ్ అంపైర్ వీరేందర్ శర్మని మైదానంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ బెదిరించాడంటూ న్యూజిలాండ్ ఫాస్ట్ బౌలర్ మిచెల్ మెక్లనగాన్ సంచలన ఆరోపణలు చేశాడు. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా మంగళవారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో.. ఇన్నింగ్స్ ఏడో ఓవర్ వేసిన వాషింగ్టన్ సుందర్ బౌలింగ్‌లో రిషబ్ పంత్ బంతిని అంచనా వేయలేకపోయాడు. బంతి టర్న్ అవుతోందని ఊహించి షాట్ ఆడగా నేరుగా వెళ్లిన బంతి బ్యాట్ అంచున తాకి అనంతరం ఫ్యాడ్స్‌ని తాకింది. అయినప్పటికీ.. ఎల్బీడబ్ల్యూ ఔట్ కోసం బెంగళూరు ఆటగాళ్లు అప్పీల్ చేశారు.